Telangana Electricity : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం..రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్

UPDATED 30 MARCH 2022 WEDNESDAY 07:00 AM

Telangana Electricity : తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్‌ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 14 వేల 160 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల వరకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 18 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ట్రాన్స్ కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగం ఎంత పెరిగినా వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us