UPDATED 20th JUNE 2017 TUESDAY 11:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విశాల్ గున్ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులు అందాయి. రాష్ట్రంలో పన్నెండు జిల్లాల ఎస్పీ ల బదిలీల్లో భాగంగా ఆయనకు తూర్పుగోదావరి బదిలీ అయ్యింది. 2010 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన విశాల్ గున్ని నెల్లూరు ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈయన గతంలో విశాఖపట్నం, నర్సీపట్నం లలో పలు హోదాలలో పనిచేశారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన రవి ప్రకాష్ ను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారు .







