UPDATED 30 AUGUST 2022 TUESDAY 09:52 PM
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ సోషల్ మెసేజ్‌తో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత చరణ్ మరో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. గతంలోనే గౌతమ్ ఓ పవర్‌ఫుల్ కథను చరణ్‌కు వినిపించాడట. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా చరణ్ సూచించాడట. తాజాగా గౌతమ్ మార్పులు చేసిన కథను చరణ్‌కు వినిపించగా, ఆయనకు ఈ స్క్రిప్టు పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది.దీంతో ఈ సినిమాను చరణ్ పక్కనబెట్టాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో చరణ్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలపై చరణ్, గౌతమ్ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.







