సామర్లకోట,23 ఏప్రిల్ 2020(రెడ్ బి న్యూస్):
స్థానిక భీమవరం,భీమవరం కొత్తపేట, కొత్తపేట,దావీదుపేట ప్రజలకు మాదిగ మహాజన సంఘం నాయకుడు కాపవరపు జాన్ ఆర్థిక సహాయంతో మాదిగ మహాజన సంఘం జాతీయ సహాయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాపవరపు కుమార్ స్థానిక ప్రజలకు భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేశారు.ఈసందర్భంగా కుమార్ మాదిగ మాట్లాడుతూ కాపవరపు జాన్ తన శక్తికి మించి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం దాయకమని,దీనికి స్థానిక యూత్ అందరూ సహకరించి ఈపంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన కారణంగా స్థానిక ప్రజలందరికీ ఒకపూట భోజనం,చికెన్ బిర్యాని ప్రజలకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో ముమ్మిడివరం వీరేష్, లంక భాస్కర రావు, ఇత్తడి దుర్గారావు, పైడిమళ్ల ప్రసాద్, పెద్దాడ కుమార్, రేపు విజయ్,కంటిపాముల నవీన్, కుమార్ ఖాన్, వేమగిరి వెంకన్న బిక్కవోలు శ్యామ్,భీమవరం పేట,భీమవరం కొత్తపేట, దావీదు పేట,యూత్ తదితరులు పాల్గొన్నారు.







