చంద్రగిరి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. కారు నెంబరు AP39HA 4003గా గుర్తించారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి గ్రామానికి చెందిన జిషిత (6 నెలలు), మీనా (30), సురేశ్ కుమార్ (36), పైడి హైమావతి (51), గోవిందరావు(61), శ్రీరామమూర్తిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. చిన్నారి మొక్కు తీర్చేందుకు తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు వెల్లడించారు.







