Somu Veerraju: ఢిల్లీకి సోము వీర్రాజు.. జనపోరు యాత్రపై వివరణ

UPDATED 4th MAY 2022 WEDNESDAY 09:00 AM

Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శ పురందేశ్వరీ, మాజీ ఎంపీ శ్రీమతి దుర్గా రామకృష్ణా, మారిశెట్టి రాఘవయ్య, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరీ, వంశీ యాదవ్ తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాగు నీటి ప్రాజెక్టులు కోసం బీజేపీ ఆధ్వర్యంలో జరిపిన జనపోరు యాత్ర గురించి వివరించారు. సాగు నీరు, తాగునీటి కోసం బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహించిన పోరాటాన్ని నడ్డా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ వారీగా జరిగిన సమావేశ వివరాలను నడ్డాకు తెలియజేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజుకు నడ్డాకు పలు సూచనలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని రెండు కుటుంబ పార్టీలకు సమాన దూరంగా ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు నడ్డా.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us