భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలే

UPDATED 13TH MAY 2017 SATURDAY 5:00 PM

పెద్దాపురం: భవిష్యత్తులో అన్ని లావాదేవీలు నగదురహితంగానే జరగనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు ప్రభుత్వం అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. నగదు రహిత లావాదేవీల ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడడమే కాకుండా నల్లధనాన్ని నియంత్రించవచ్చన్నారు. అనంతరం లాటరీ పద్ధతి ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసిన మండలంలోని పదమూడు మందికి ఆయన చేతులు మీదుగా స్మార్టుఫోన్ లను అందచేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పటికే నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, నగదు రహిత లావాదేవీలు నిర్వహించే వారికి ప్రోత్సాహకం గా స్మార్టుఫోన్ లను అందచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరి బాబు రాజు, సామర్లకోట ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు( శ్రీనుబాబు) తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us