Updated 3rd July 2023 Monday 10:20 am
Tadipatri CI Ananda Rao : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆనందరావు ఆత్మహత్యపై స్పందించిన ఎస్పీ కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. కానీ సీఐ కుటుంబ సభ్యులు మాత్రం పని ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతోంది. ఇలా కుటుంబ సభ్యులు చెప్పే కారణాలకు, పోలీసులు చెప్పే కారణాలకు ఎక్కడా పొంతన కుదరటంలేదు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారు. అయినా ఎక్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు తన వద్ద బాధపడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కాగా తాడిపత్రిలో పని చేసే పోలీసులకు పని ఒత్తిడికి పై అధికారుల ఒత్తిడి ఉంటుందని అక్కడ పనిచేసే పోలీసులు చెబుతుంటారు.మరి సీఐ ఆనందరావు ఆత్మహత్యకు కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.







