ఘనంగా మరిడమ్మ జన్మ నక్షత్ర పూజలు

UPDATED 16th JULY 2018 MONDAY 8:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసివున్న మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సోమవారం వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు ఎ.వి. శాస్త్రి, ఐ.వి. ప్రసాద్ శర్మ, ఎ.వి. భానుమూర్తి, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం, రాయి విజయకుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us