Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మరో ఆలోచన లేదు-తేల్చి చెప్పిన కేంద్రం

UPDATED 25th JULY 2022 MONDAY 08:30 PM

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం వివరంచింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. అయితే పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నట్లుగా మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us