ఎంపిపి మార్త కు ఘన నివాళి

UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక కుమ్మరవీధిలో ఎంపిపి గొడత మార్తకు శనివారం సంతాప సభ నిర్వహించారు. మార్త అందించిన సేవలు ఆమోఘమని కొనియాడారు. అలాగే ఆమె పేదలకు అందించిన సేవలు మరువలేనివన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంతాప సభలో శ్రీ  భీమేశ్వరస్వామి  దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ అడబాల కుమారస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణ ప్రెసిడెంట్ కొల్లి  చైతన్య కుమార్, కౌన్సిలర్లు చాపల అపరంజి, కాపవరపు కుమార్, గొడత సూర్య నందం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us