రహదారి విస్తరణకు వ్యాపారులు సహకరించాలి

UPDATED 30th MAY 2017 TUESDAY 11:00 AM

పెద్దాపురం: దివిలి ప్రధాన జంక్షన్ విస్తరణకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు సహకరించాలని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం దివిలి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం చంద్రమాంపల్లి పాఠశాల ఆవరణలో వ్యాపారులతో చర్చించారు. వ్యాపారులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆర్ అండ్ బి స్థలాల్లో ఉన్న వ్యాపారులు ఖాళీ చేయాలని సూచించారు. వ్యాపారులకు జి ప్లస్ 2  తరహాలో జిల్లా పరిషత్ అనుమతితో ఇక్కడ వ్యాపార సముదాయాలను  నిర్మించడం జరుగుతుందన్నారు. దానికి వ్యాపారస్థులే అద్దె చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. భవనాల నిర్మాణాలకు సంబంధించి అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రహదారిని విస్తరించి ప్రమాదాలను అరికట్టేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి) తో కలిసి వ్యాపారుల నుండి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అలాగే పులిమేరు పి హెచ్ సి  అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఇరిగేషన్ డిఈ కృష్ణారావు, మండల కో ఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, తిరుపతి సర్పంచ్  మొయిళ్ళ కృష్ణమూర్తి,  దేవళ్ళ వరప్రసాద్ (బోస్), పులిమేరు పి హెచ్ సి అభివృద్ధి కమిటి ఛైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us