ENTERTAINMENT UPDATE | తొలి తిరుపతి క్షేత్రంలో సందడి: శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి అనసూయ

UPDATED 4th JUNE 2026 7:00 PM

పెద్దాపురం, రెడ్ బీ  న్యూస్, జూన్ 4: ప్రముఖ సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పెద్దాపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘తొలి తిరుపతి’ శ్రీ శృంగార వల్లభ స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె అంతరాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ విశిష్టతను, తొలి తిరుపతి క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా ఆమె అడిగి తెలుసుకున్నారు.

​స్వామివారి దర్శనం అనంతరం అనసూయ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రంలో, అత్యంత ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. తొలి తిరుపతి క్షేత్రానికి రావడం, స్వామివారి కృపకు పాత్రులు కావడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాగా, నటి అనసూయ రాకతో ఆలయ ప్రాంగణంలో కాసేపు సందడి వాతావరణం నెలకొంది. ఆమెను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు స్థానిక అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us