UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 03:00 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తొలగించి.. రెండ్రోజులపాటు వెయిట్ చేయించి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ఉదయం ప్రకటించింది. అయితే కొన్ని గంటల గ్యాప్‌లోనే సవాంగ్ నియామకంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. వాస్తవానికి ఆయన్ను వేరే శాఖకు బదిలీ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే.. ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ పదవి కావటంతో సవాంగ్ కచ్చితంగా ఐపీఎస్‌గా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 17 నెలలు సర్వీస్ ఉండటంతో సవాంగ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన్ను బదిలీ చేసిన నాటి నుంచి ఇప్పటివరకూ సవాంగ్ స్వచ్ఛంద పదవీ విరమణ ఫైల్ సచివాలయానికి చేరలేదు. అయితే ఈలోపే గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ అంటూ పెద్ద ఎత్తున లీకులు వచ్చేశాయ్. అంతేకాదు.. వికీపీడియాలో కూడా అప్పుడే ఏపీపీఎస్సీ చైర్మన్ అంటే గౌతమ్ సవాంగ్ పేరుండటం గమనార్హం.







