UPDATED 14th FEBRUARY 2018 WEDNESDAY 7:00 PM
రాజానగరం: జాతీయస్థాయి ఒలెంపిక్ గేమ్స్ లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకున్నట్లు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ బుధవారం తెలిపారు. ఈ నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు డామన్ లో నిర్వహించిన స్టూడెంట్ ఒలెంపిక్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో బాక్సింగ్ పోటీలు నిర్వహించినట్లు బాక్సింగ్ కోచ్ సామ్యూల్ రాజు తెలిపారు. అండర్-19లో 69 కిలోల విభాగంలో ఎం. నాగ సందీప్ బ్రాంజ్ మెడల్, 78 కిలోల విభాగంలో టి. మనోజ్ ఆనంద్ సిల్వర్ మెడల్, అండర్- 19లో 84 కిలోల విభాగంలో ఐ.ఎస్.ఎస్. సాయిరాం సిల్వర్ మెడల్ సాధించారని, అలాగే అండర్-22లో 68 కిలోల విభాగంలో ఆర్. ప్రవీణ్ కుమార్ గోల్డ్ మెడల్, అండర్-25 లో 64 కిలోల విభాగంలో టి.శివ ప్రసాద్ సిల్వర్ మెడల్ సాధించారన్నారు. జాతీయస్థాయి ఒలెంపిక్ గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలను కైవసం చేసుకున్న విద్యార్థులను చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు(చైతన్య రాజు), గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మి శశివర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్.ఎస్. గుప్త, వైస్ ప్రిన్సిపాల్ పి.వి.జి.కె. జగన్నాధరాజు, డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







