చోరీ సొత్తు స్వాధీనం

సామర్లకోట: 22 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): సామర్లకోట, కిర్లంపూడి తదితర ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని సామర్లకోట పోలీసులు సోమవారం ఆరెస్టుచేసి అతని వద్ద నుంచి రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐ జయకుమార్, ఎస్ఐ సుమంత్ వివరాలను వెల్లడించారు. జి.మేడపాడుకు చెందిన అగ్రహారపు రాజు సామర్లకోటలో రెండు, కిర్లంపూడిలో ఒక ఇంటిలోను దొంగతనాలకు పాల్పడి రూ.ఐదు లక్షలు విలువగల నగదు ఆభరణాలు అపహరించాడు.రెండు పోలీసుస్టేషన్లలో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ ఆచూకీ కోసం గాలించగా సోమవారం పోలీసులకు దొరికాడు. ఇతని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందికి రివార్డు నిమిత్తం సిఫార్స్ చేయనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us