ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు

UPDATED 9th NOVEMBER 2020 MONDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): కోవిడ్ వ్యాక్సిన్ నిమిత్తం జిల్లాలో నమోదైన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను 48 గంటల్లోగా సమర్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కెవిఎస్ గౌరీశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు రిజిస్టర్ అయిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ హోంలు,  క్లినిక్స్, ఫిజియోథెరపి, డెంటల్ క్లినిక్స్, నర్సింగ్ స్కూల్స్, ఆయుష్ ఆసుపత్రులు, లేబోరేటరీల్లో పనిచేస్తున్న తమ సిబ్బంది పేరు, ఆసుపత్రి పేరు, గుర్తింపు పత్రం తదితర అన్ని వివరాలతో నిర్దేశిత ప్రొఫార్మాలో cvbmsegdt@gmail.com వెబ్ సైట్ కు పంపాలని అన్నారు. వివరాలు పంపని యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారిణి డాక్టర్ వి. అరుణ, గణాంక అధికారిణి బి.వి. విజయలక్ష్మి, డెమో ప్రసాద్ రాజు పాల్గొన్నారు.    

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us