Acharya: ‘ఆచార్య’ ఐటమ్ సాంగ్‌పై ఆర్‌ఎంపీల అభ్యంతరం..!

రెడ్ బీ న్యూస్, 6 జనవరి 2022: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఇందులోని ఐటమ్‌ సాంగ్‌ ‘‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’’ లిరికల్‌ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. హీరోయిన్‌ రెజీనా చిరు పక్కన తొలి సారి ఆడిపాడారు. అయితే ఈ ‘సానా కష్టం’ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ జనగామ ఆర్ఎంపీ సంఘం ఆరోపించింది. ఈ పాటలోని ‘‘ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లే ఆర్ఎంపీలు అవుతున్నారే’’ అనే వాక్యాలు తమ వృత్తిని కించపర్చేలా ఉన్నాయన్నారు. దీనిపై ఆర్‌ఎంపీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ.. జనగామ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ బాలాజీ వరప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పాట రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఆ పాటను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us