అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి

UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: నేటి యువతరం అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. అల్లూరి 121వ జయంతిని స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు అల్లూరి సీతారామరాజు అని, మన్యంలోని గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఏటా జరుపుకుంటున్నామని, ఆయన మహోన్నత వ్యక్తిత్వం సదా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన అల్లూరి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.ఎల్.వి. కుమారి, ఎ.పి. రాజేంద్రకుమార్, కె. అరుణ, రమాదేవి, గోవిందు, షఫియుల్లా, పిఇటి మానం వెంకటేశ్వర్లు, కె.వి.వి. సత్యన్నారాయణ, కె. శ్రీనివాసు, కోడూరి సత్య శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us