ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు

UPDATED 12th OCTOBER 2017 THURSDAY 8:00 PM

రంగంపేట: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖా మంత్రి కె.ఈ. కృష్ణమూర్తి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి రూ.90 లక్షలు వ్యయంతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పరిపాలనా పరంగా చేరువలో ఉండేందుకు రాష్ట్రంలో నూతనంగా 105 తహసీల్దార్ కార్యాలయాలు, 8 రెవిన్యూ డివిజన్ కార్యాలయాలు మంజూరు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 14 తహసీల్దార్ కార్యాలయాలు, రెండు డివిజన్ కార్యాలయాలకు రూ.17.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే రెవిన్యూ పరంగా ఇళ్ళ స్థలాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ, భూమి హక్కు పత్రాలను జారీ చేయడంతో పాటు భూసంబంధమైన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజాసంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారన్నారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని, గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నారన్నారు. అలాగే రైతుల సంక్షేమానికి సాగునీటి పథకాలను చేపట్టి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఎస్ సి, బిసి, కాపు కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఋణాలను మంజూరు చేస్తున్నామన్నారు. స్థానిక అనపర్తి నియోజక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయే రైతులకు న్యాయం చేయాలని మంత్రులను కోరారు. అనంతరం విద్యుత్ ప్రమాదంలోమరణించిన రెండు కుటుంబాల సభ్యులకు రూ. రెండు లక్షలు చప్పున మంత్రుల చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్, ఎంపిపి ఎం.నాగసత్యవేణి, జగ్గంపేట ఎఎంసి వైస్ చైర్మన్ అడబాల వెంకటరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎం. త్రిమూర్తులు, ఎంపిటిసి విజయకుమారి, తహసీల్దార్ ఎం.కృష్ణమూర్తి, ఎంపిడిఓ సి.హెచ్. విజయభాస్కర్, సత్తి దేవానందరెడ్డి, ఎస్.నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us