Pawan Kalyan: ఏప్రిల్ 27.. ఫ్యాన్స్‌ను డబుల్ ‘ఖుషీ’ చేయనున్న వీరమల్లు..?

Updated 1st December 2022 11:50 am

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.

అయితే 2023 ఏప్రిల్ 27న తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున పవన్ కల్యాణ్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్ ‘ఖుషీ’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున హరిహర వీరమల్లు చిత్రం నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను కూడా ప్రేక్షకులకు అందించనున్నారు.

ఇలా ఒకే రోజున పవన్ నుండి రెండు ట్రీట్‌లు రానుండటంతో అభిమానులకు డబుల్ ఖుషీ ఖాయమని పవన్ భావిస్తున్నాడట. మరి ఏప్రిల్ 27న పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో అని సోషల్ మీడియాలో అప్పుడే టాక్ నడుస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us