UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 7:00 PM
సామర్లకోట: బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు మంగళవారం పౌష్టికాహారం పంపిణి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అర్బన్ ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలోని స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంక్ వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అరకేజీ వేరుశనగ గుళ్ళు, అరకేజీ బెల్లం, అందచేశారు. అంబటి సుబ్బన్న ఆయిల్ కంపెనీ యాజమాన్యం సెక్టార్ పరిధిలోని చిన్నారులకు 38 కేజీల బెల్లం ఇచ్చినట్లు ఐసిడిఎస్ సూపర్ వైజర్ డి. మణి తెలిపారు. ఈ బెల్లంతో వేరుశనగ అచ్చులు, ఉండలు తయారుచేసి చిన్నారులకు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె. వరలక్ష్మి, కె. కుమారి, కె. లక్ష్మి, జె. ధనలక్ష్మి, పి. సత్యకుమారి, టి. సత్యవేణి, టి. సూర్యకళ, పి. కనదుర్గ, తదితరులు పాల్గొన్నారు.







