ఎలక్ట్రిక్ బైక్ రూపకల్పనలో గైట్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 15th MARCH 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల విద్యార్థులు విద్యుత్ తో నడిచే బైక్ రూపొందించి తమ ప్రతిభను చాటారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు తోట చైతన్య సాయి, చింత బాల మహేష్, డేరంగుల సుబ్రహ్మణ్యం, సింగాల సురేష్ తమ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా గైడ్ పెండ్యాల వీర్రాజు, విభాగాధిపతి వి. సుబ్రహ్మణ్యం సూచనల మేరకు రోజురోజుకు తరిగిపోతున్న ఇంధన వనరులు, అధిక ఉష్ణోగ్రతలు, కాలుష్య సమస్యలు తీర్చడానికి ఈ బైక్ ను రూపొందించారు. స్క్రాప్ యార్డ్ నుంచి ఒక పాత బైక్ ను సేకరించి, దానికి తగిన మార్పులు, చేర్పులు చేసి కావలసిన విద్యుత్ పరికరాలను ఇంటర్నెట్ నుంచి ఆర్డర్ చేసి విద్యుత్ ఘటాలతో నడిచే విధంగా దీనిని తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి మాట్లాడుతూ 48 వోల్టుల బ్యాటరీలతో, చక్రంలో అమర్చిన మోటార్ తో ఒకసారి  రీఛార్జ్ చేస్తే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో, గంటకు 50 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుందన్నారు. ఒకసారి రీచార్జింగ్ కు మూడు గంటల సమయం పడుతుందని, మూడు యూనిట్లు విద్యుత్ ఖర్చు అవుతుందని అన్నారు. ఈ వాహనం తయారీకి రూ. 36 వేలు ఖర్చుచేశామన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us