అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 26 th OCTOBER 2017 THURSDAY 7:00 PM

పెద్దాపురం: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో గురువారం రూ. 1.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన పేదలకు, వృద్ధాప్య, వికలాంగుల, వితంతువులకు ప్రతీ నెలా పింఛన్లు, ప్రధానమంత్రి చంద్రన్నభీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు, సహజ మరణానికి రూ. రెండు లక్షలు అందిస్తున్నామన్నారు. ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళను నిర్మిస్తున్నామని, ఎస్ సి, ఎస్ టి వర్గాల వారికి వివాహ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు.  గ్రామాల్లో మౌలికవసతులు కల్పనకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రూ. 80 లక్షలుతో 16 సిసి రోడ్లు, డ్రైన్లు, రూ.15 లక్షలుతో నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 14 లక్షలుతో రెండు అంగన్వాడీ భవనాలను, రూ. రెండు లక్షలుతో సిసి రోడ్డును మంత్రి  ప్రారంభించామన్నారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు ( రాజబ్బాయి), వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాస రావు(కోటి), తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, తదితరులు పాల్గొన్నారు.                
    
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us