ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వీరేంద్రకుమార్

UPDATED 5th AUGUST 2017 SATURDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోసిన వీరేంద్రకుమార్ (బుజ్జి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక  గాలిబంగ్లాలో శనివారం జరిగిన ఈ ఎన్నిక కార్యక్రమంలో కార్యదర్శిగా తోట సూర్య రామకృష్ణ, కోశాధికారిగా అనుకుల విజయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా వేము భాస్కరావు, గురుమూర్తి రామారావు, పోతుల బాబ్జి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరి సహాయ సహకారాలతో కృషి  చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అల్లాడ రమణమూర్తి, ఎస్.ఎల్. రెడ్డి, దుర్గాప్రసాద్, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుమోహన్, బాబ్జి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.       
  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us