క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యం

UPDATED 28th JUNE 2017 WEDNESDAY 6:00 PM

గండేపల్లి: అత్యుత్తమ విద్యాబోధన, క్రమశిక్షణ, నైపుణ్యంతో కూడిన విద్యను అందించడమే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యమని సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో బుధవారం మాట్లాడారు. ఇప్పటివరకు అభ్యసించిన విద్యా విధానానికి ఇంజనీరింగ్ విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని, కష్టపడి చదివి నేర్చుకున్న దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. తమ కళాశాలలో చేరిన విద్యార్థుల భవిష్యత్తుకు ఆదిత్య సంస్థ వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సంస్థ  వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల కలలను వాస్తవరూపం దాల్చడానికి నూరు శాతం ప్రయత్నం చేస్తున్నామని ప్లేస్ మెంట్, ట్రైనింగ్, ప్రపంచ స్థాయి లాబొరేటరీ సౌకర్యాల కల్పన వంటి సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మురళీకృష్ణ, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us