UPDATED 23rd OCTOBER 2017 MONDAY 9:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక వీరభద్ర థియేటర్ లో ప్రముఖ సినీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు హాజరై భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ప్రభాస్ అభిమానులు ఉల్లాసంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.







