UPDATED 8th OCTOBER 2017 SUNDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో "పర్యావరణం, ఫార్మసీ, సాంకేతిక రంగాలు కెమిస్ట్రీ పరంగా చోటుచేసుకుంటున్న నూతన పోకడలు" అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ఆదివారంతో ఘనంగా ముగిసినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ దిబాకర్ చంద్ర దేఖా, డాక్టర్ రామకృష్ణన్ హాజరై మాట్లాడారు. రీసెర్చ్ లో మాస్ స్పెక్ట్రోమెట్రీ యొక్క ప్రాముఖ్యత, దాని ఉపయోగాలపై వారు మాట్లాడారు. అలాగే డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ మాట్లాడుతూ ప్రకృతి చర్యలకు మానవుని ప్రతి చర్యలు ఏవిధంగా ఉంటాయో తెలిపి మానవ జీవితంలో రోజురోజుకి పర్యావరణంలో వస్తున్న మార్పులు గురించి వివరించారు. అలాగే వక్తలు ఎస్. పోసలయ్య, జి.శ్రీశైలం, సి.హెచ్.కృష్ణప్రసాద్, ఎ.శివకుమార్, ఆశిష్ భూమిక్ లు మాట్లాడుతూ కెమిస్ట్రీ మన నిత్య జీవితంలో నవ సమాజాన్ని నిర్మించడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూ ప్రసాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే సదస్సులో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన స్నేహశ్రీ, తేజస్వి, అచ్యుత శ్రీసాయి, వి.వి. అమరేంద్ర, వర్షిత, అలాగే ఓరల్ ప్రెసెంటేషన్ లో ఎం.రాంబాబు, ఎస్.పోసలయ్య, ఆశీష్ భూమిక్ లను విజేతలుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి.హరినాథ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







