Minister Roja On Jagan : జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం- మంత్రి రోజా

UPDATED 15 th APRIL 2022 FRIDAY 05:30 PM

Minister Roja On Jagan : ప్రజలంతా ఆరాధించే దేవుడు వైఎస్ఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నారు. వైఎస్ తో పని చేయలేదన్న బాధ ఉన్నా.. ఆయన కుమారుడు జగనన్నతో అడుగులో అడుగు వేసి నడుస్తున్నాం అని చెప్పారు.

కడప జిల్లా ఇడుపులపాయలో మంత్రి రోజా మాట్లాడారు. తనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారామె. టీడీపీలో నుండి బయటకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అడుగులో అడుగు వేయలనుకున్నానని, దురదృష్టవశాత్తు ఆ ఆవకాశాన్ని కోల్పోయామని రోజా వాపోయారు. మా నాన్నను నమ్ముకుని వచ్చిన మీకు అండగా ఉంటామని జగనన్న ఆరోజు చెప్పారని రోజా గుర్తు చేశారు. అన్నట్టుగానే ప్రతి సందర్భంలో జగనన్న అండగా ఉన్నారని తెలిపారు.(Minister Roja On Jagan)

రాజకీయంగా నాకు భవిష్యత్ ఇచ్చి, నా చెల్లి అని చెప్పి, అసెంబ్లీలో నా కోసం సపోర్ట్ గా జగన్ మాట్లాడం ప్రజలంతా చూశారని రోజా అన్నారు. జగన్ ఏ నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనకు పేరు తెచ్చే విధంగా పని చేస్తానని రోజా అన్నారు. తనకిచ్చిన పదవితో ఆదాయం తీసుకురావడమే కాకుండా జిల్లాలో తనకిచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.

క్రెడిబిలిటీకి కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కుటుంబం అన్న రోజా.. అలాంటి కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు.రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకునేందుకే ఇడుపులపాయకు వచ్చినట్టు ఆమె తెలిపారు. ఇడుపులపాయకి రాగానే వైఎస్ఆర్ మాట్లాడిన మాటలు చెవిలో తిరుగుతుంటాయన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకుని మరింత రెట్టింపు ఎనర్జీతో పని చేసి రాబోయే 2024లో జగన్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే విధంగా మేమంతా పని చేస్తామని రోజా అన్నారు.

అందరం సైనికులుగా పని చేస్తామని ఆమె వాగ్దానం చేశారు.(Minister Roja On Jagan)కాగా, మంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. చివరికి ఆమె కల ఫలించింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పించారు సీఎం జగన్. తొలుత.. మంత్రివర్గ కసరత్తులో సామాజిక సమీకరణలు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో రోజాకు మరోసారి మొండిచేయి తప్పదని ప్రచారం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి వరించింది.

దీంతో రోజా, ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేవు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. రోజా కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు రోజా. ఆయన చేతిని ముద్దాడి తన అభిమానం చాటుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us