డిస్క్ త్రోలో ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థి డిస్క్ త్రోలో విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐఎంబిఎ విద్యార్థి సి. వివేక్ కాకినాడ జె.ఎన్.టి.యు ఆదేశాల మేరకు ముమ్మిడివరం ఎఐఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో డిస్క్ త్రోలో ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం సాధించినట్లు సుగుణారెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గోవడం వల్ల మంచి శారీరక, మానసిక వికాసం పొందుతారని, విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారికి గల ఆసక్తిని బట్టి ఆయా క్రీడలలో సుశిక్షితులైన అనుభవజ్ఞులైన వ్యాయమ అధ్యాపకులచే శిక్షణనిచ్చి ప్రోత్సహించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. విజేతను అధ్యాపక సిబ్బంది, సహచర విద్యార్థులు, తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us