ఐ.పోలవరం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబరు 2021 : మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి కార్తీక మాసశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని లక్షపత్రి పూజ గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యం లో లక్షపత్రి పూజా కార్యక్రమం జరిపించారు. ఆలయ చైర్మన్ పెన్మెత్స వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు పేటేటి శ్యామలకుమార్‌శర్మ, పేటేటి శశి, నాగాభట్ల శ్రీరామశర్మ, కిషోర్‌శర్మ పాల్గొన్నారు.







