తిరుమల (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: తిరుమల క్షేత్రాన్ని బాలీవుడ్ నటి జాన్వీకపూర్ దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ పరిసరాల్లో జాన్విని చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జాన్వి.. ‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. నటి శ్రీదేవికి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనానికి వచ్చేవారు. తన తల్లిలానే తనకీ తిరుమల అంటే ఎంతో ఇష్టమని.. స్వామి సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వి ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.







