Konaseema Thirumala Vadapalli : కల్పవృక్ష, అశ్వ వాహనాలపై బ్రహ్మాండ నాయకుడు

UPDATED 21st OCTOBER 2022 FRIDAY 10:10 PM

▪️ ఆకట్టుకున్న మహారాష్ట్ర వాయిద్యాలు, పంజాబీ డ్రమ్స్‌

▪️ ఎనిమిదో రోజుకు వాడపల్లి బ్రహ్మోత్సవాలు

Konaseema Thirumala Vadapalli : వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామతృ మండపారాధన, ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళ మంగళ వాయిద్యాల నడుమ అశేష భక్తజనం ఊరేగింపుగా తరలివెళ్లి గౌతమి గోదావరిలో నదీజల సంగ్రహణ చేశారు. గోదావరి జలాల ను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించారు. అనంతరం లక్ష కుంకుమార్చన జరిగింది. సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, మూలమంత్రపూర్వక మహాలక్ష్మి హోమం జరిపారు. చూర్ణోత్సవం కన్నుల పండువగా జరిగింది.

వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు పూజలు చేయించగా ఆలయ ధర్మకర్తలు మన్యం సూర్యకుమారి, భాను దంపతులు, రెడ్డి రవీదేవి, చంటి దంపతులు కర్తలుగా పాల్గొన్నారు.

ఆలయ కల్యాణ వేదికవద్దగల కల్పవృక్షం చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్పవృక్ష వాహన సేవను వైభ వంగా జరిపారు. పంజాబీ డ్రమ్స్‌, కోలాట ప్రదర్శన అలరించగా మహారాష్ట్ర వాయిద్యాలు భక్తులను ఉర్రూతలూగించాయి. రాత్రి 8.30 గంటలకు కల్యాణ వేదిక వద్ద స్వామివారిని కల్కి అలంకరణతో ముస్తాబు చేసి అశ్వవాహనంపై ఆశీనులుగావించారు. భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ మాడ వీధు ల్లో విహరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు, ధర్మకర్తలు పి.సురేష్‌రాజు, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు, శనగన సత్యనారాయణ, రొట్టె రాజేశ్వరి, కె.శారదాంబ పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us