UPDATED 20TH MAY 2017 SATURDAY 11:00 AM
పెద్దాపురం : గత నాలుగు రోజులుగా స్థానిక సమాచార కార్యాలయం వద్ద ఒక బండి అనుమానాస్పదంగా నిలిపివేసి ఉండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో యాక్టీవా AP 12K 8796 నెంబర్ తో ఉన్న ఈ బండి ఎవరైనా దొంగిలించి ఇక్కడ వదిలేశారా లేక ఏదైనా హత్య కేసులో ఎవరైనా దీనిని ఇక్కడ వదిలి పారిపోయారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా బండి ఇక్కడే ఉండడంతో చోరీకి గురయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.







