UPDATED 15th AUGUST 2017 TUESDAY 6:00 PM
హైదరాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఎట్‌హోంగా పిలిచే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ విందుకు హాజరు కావాలని గవర్నర్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేనీటి విందుకు పవన్ తొలిసారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరినీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ విందుకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్ర శేఖరరావు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు.







