Updated 10th April 2023 Monday 10:00 am
విశాఖ పట్టణంలో ఈ నెల చివరిలో బహిరంగ సభనుసైతం ఏర్పాటు చేయాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఇదే అనువైనమార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఎజెండాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా విశాఖ పట్టణం కేంద్రంగా ఈ నెలాఖరున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభ వేదిక ద్వారా విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడం ద్వారా ఏపీ ప్రజల మనన్నలు పొందేలా బీఆర్ఎస్ అధినేత పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.







