Janhvi Kapoor : నేను సౌత్ అమ్మాయినే.. మరోసారి సౌత్ సినిమాలపై జాన్వీ వ్యాఖ్యలు..

UPDATED 27th NOVEMBER 2022 10:15 AM

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ లో, ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. జాన్వీకి సౌత్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీని తెలుగు వాళ్ళు మరింత ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తే కచ్చితంగా నటిస్తాను అని పలుమార్లు చెప్పింది జాన్వీ. తాజాగా మరోసారి సౌత్ సినిమాలపై మాట్లాడింది.

శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకి జాన్వీ కపూర్ హాజరైంది. ఈ షోఅనంతరం జాన్వీ మీడియాతో మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి, తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”ఒకరకంగా చెప్పాలంటే నేను కూడా సౌత్ అమ్మాయినే. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ, నాన్న సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిసారి వచ్చేవాళ్ళం. అలాగే తిరుపతికి కూడా చాలా సార్లు వచ్చాం. తిరుపతి అంటే చాలా ఇష్టం. సౌత్ తో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. తెలుగులో సినిమా చేయడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను” అని తెలిపింది.

ఇక సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ”గతంలో కూడా హిందీలో సౌత్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇటీవల ఇంకా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అది మంచి విషయమే. సౌత్ నుంచి సినిమాలు వస్తే బాగుంటాయని అక్కడి ప్రేక్షకులు అనుకుంటున్నారు. నేను కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాను” అని తెలిపింది. మరి జాన్వీ ఏ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us