TS News: తెలంగాణలో 20 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021‌: తెలంగాణకు చెందిన 20మంది పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నుంచి ఇండియన్‌ పోలీసు సర్వీసుకు వారిని నియమించారు. 2016 నుంచి 2020 బ్యాచ్‌లకు చెందిన మొత్తం 20 మందికి ఐపీఎస్‌ హోదా దక్కింది. 2016 బ్యాచ్‌లో కోటిరెడ్డి, సుబ్బరాయుడు, నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, అన్నపూర్ణ, పద్మజ, జానకి ధరావత్‌ ఉన్నారు. 2017 బ్యాచ్‌కు చెందిన పి.యాదగిరి, 2018 బ్యాచ్‌కు చెందిన కేఆర్‌ నాగరాజు, ఎం.నారాయణ, 2019 బ్యాచ్‌కు చెందిన వి.తరుపతి, ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, డి.ఉదయ్‌ కుమార్‌రెడ్డి, కె.సురేష్‌ కుమార్‌ పేర్లు జాబితాలో ఉన్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించి బి.అనురాధ, సి.అనసూయ, షేక్‌ సలీమా, ఆర్‌.గిరిధర్‌, సి.హెచ్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. ఐపీఎస్‌ నిబంధనలకు లోబడి ఈ అధికారులందరూ ఏడాదిపాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us