అశ్వ వాహనంపై అలమేలుమంగ

తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అశ్వ వాహనసేవ జరిగింది. అమ్మవారు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం ఉదయం 11.52 గంటల నుంచి 12 గంటల మధ్య చక్రస్నానం జరగనుంది. రాత్రి ఏడు గంటలకు జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us