UPDATED 21st MARCH 2022 MONDAY 01:00 PM
Suspension Of TDP MLAs Again : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. అవే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు లేవడం.. ఆందోళనలు చేయడం, నిరసనలు దిగడం పరిపాటై పోయింది. 2022, మార్చి 21వ తేదీ సోమవారం కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు.
సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇది బజార్ కాదు.. శాసనసభ, మీరు ఎమ్మెల్యేలు వీధి రౌడీలు కాదంటూ వ్యాఖ్యానించారు. ఇలా ప్రతిరోజు ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలికారు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, సభలో ప్రతిపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని సూచించారు.
రూల్స్ ఇవ్వడం.. ప్రతిరోజు నిరసనలకు దిగడం ఏ మాత్రం మంచిది కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి ముందుకు రావాలన్నారు స్పీకర్ తమ్మనేని.







