UPDATED 26th MARCH 2022 SATURDAY 11:20 AM
Tirupati : తిరుపతిలో శనివారం రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఒకవిద్యార్ధిని, ప్రేమ విఫలమయ్యిందని ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనలలోనూ ప్రేమే ప్రధాన కారణంగా మారింది. పద్మావతి కళాశాలలోని హాస్టల్ గదిలో విష్ణు ప్రియ(17) అనే విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతురాలు కె.వి పల్లి మండలం గర్ని మిట్ట వాసి కాగా ఆమె తల్లి తండ్రులు కువైట్ లో ఉంటున్నారు.మరోక ఘటనలో ప్రేమ విఫలం అయ్యిందని ఇంటర్ విద్యార్ధి నాగేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతిలోని బీసీ హాస్టల్ ఉంటున్న నాగేంద్ర కుమార్ హాస్టల్ ఐదవ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బీమగానిపల్లిగా తెలిసింది.