CM Jagan: దత్తపుత్రుడి పార్టీని ‘రౌడీ సేన’గా మార్చేశారు: సీఎం జగన్

UPDATED 21st NOVEMBER 2022 MONDAY 2:30 PM

Jagan slams Chandra babu: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి వారి నోటికి ఈ మధ్య ఎక్కువగా పనిచెబుతున్నారని అన్నారు. గతంలో కలిసి చేసిన పాలనను ఇదేం కర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని.. అన్నిచోట్లా కూడా ప్రజలు ఓడగొట్టి బైబై చెప్పారని అన్నారు. తాము చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని వర్గాలూ, ప్రాంతాలూ ఓటు వేసి ప్రతి ఉప ఎన్నికల్లోనూ, ప్రతిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశీర్వదించి మనకు అనుకూలంగా తీర్పు చెప్పారని అన్నారు.

కుప్పంలో కూడా తమకు ఓటువేశారని అన్నారు. టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ అనికూడా చెప్పారని తెలిపారు. అందుకే… చంద్రబాబు ఇదేం కర్మరా బాబూ అని తన తలపట్టుకుని తాను కూర్చుకుంటే.. ఆయన పుత్రుడు, ఆయన దత్తపుడ్రుకూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబూ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్‌కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీలో, తన కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు తానుకూడా ఇదేం కర్మరా బాబూ అని తానుకూడా అనుకుని ఉంటాడని చెప్పారు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఇదేం కర్మరా బాబూ అని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

‘‘ఈ మధ్యకాలంలో చంద్రబాబు కొన్ని మాటలు అన్నారు. తాను రాజకీయాల్లో ఉండాలంటే… అసెంబ్లీకి వెళ్లాలంటే.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. సరేసరి..అని ప్రజల్ని కూడా బెదిరిస్తున్నాడు. చివరకు కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహలు.. చంద్రబాబు మాటల్లో, చేష్టల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నప్పుడు కొందరు సెల్‌ఫోన్‌ టవర్‌నుంచి దూకేస్తానంటారు.. రైళ్లకింద పడిపోతానంటారు.. పురుగులమందు తాగేస్తానంటారు.

చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు.. రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడు. చేయని పనులకు ఎందుకు ప్రజలు ఓటేస్తారు? ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. ప్రశ్నిస్తానన్న కొందరు కూడా ప్రశ్నించరు. వీళ్లందరిన్నీ చూసినప్పుడు ఇదేం కర్మరా బాబూ అని అనిపిస్తుంది. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అని కొలమానంగా చూసుకోండి. మంచి జరిగితే.. మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ బిడ్డకి తోడుగా నిలబడండి. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే ఒక్కటే కొలమానంగా తీసుకోండి’’ అని జగన్ అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us