UPDATED 4th MARCH 2022 FRIDAY 07:30 AM
Yadadri : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 10న ఎదుర్కోలు, 11న బాలాలయంలో తిరుకళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అష్టోత్తర శత ఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.







