UPDATED 25th OCTOBER 2022 TUESDAY 01:00 PM
WhatsApp Down : పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లో సుమారు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమస్య మొదలైంది. వేలాది మంది యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదులు చేస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవడం లేదు, రిసీవ్ కావడం లేదు. మొత్తంగా వాట్సాప్ సర్వీస్‌లన్నీ స్థంభించిపోయాయి (WhatsApp Outage). అయితే ఈ విషయంపై వాట్సాప్ ఇంకా స్పందించలేదు. సర్వర్లలో లోపం కారణంగానే వాట్సాప్‌లో సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది.
వాట్సాప్ పర్సనల్ చాట్స్‌తో పాటు గ్రూప్స్‌కు కూడా సమస్య తలెత్తింది. ఎలాంటి మెసేజ్‌లు సెండ్ అవడం లేదు. అయితే ఎక్కువగా పర్సనల్ చాట్స్‌లోనే ఈ ఔటేజ్ తలెత్తింది. మేసెజ్‌లు పంపడం ప్రస్తుతం కుదరడం లేదు. ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ (DownDetector) కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్ సర్వీస్‌లు డౌన్ అయినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై వాట్సాప్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది. సమస్యను త్వరగా పరిష్కరించే ఛాన్స్ ఉంది.







