అర్హులైన గిరిజనులకే అటవీ హక్కులు

రంపచోడపరం,27 మే 2020 (రెడ్ బీ న్యూస్): అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం అర్హులైన గిరిజనులుకు హక్కులు సంక్రమింపజేయాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై సబ్ డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాల్లో బుధవారం నిర్వహించారు. ప్రక్రియకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు. అటవీ హక్కుల పట్టాలు జారీకోసం గిరిజనులు ముందుగా అటవీ హక్కుల కమిటీకి తమ ధరఖాస్తులును సమర్పించుకోవాలన్నారు. తరువాత వాటిని గ్రామ సభలో ప్రాథమిక విచారణ పక్కాగా చేపట్టి అర్హత కలిగిన వారి అప్పీళ్లను సబ్ డివిజనల్ కమిటీ పంపాలని, తరువాత జిల్లా స్థాయి కమిటీ వారి అప్పీళ్లు పరిశీలించి పట్టాలు మంజూరు చేస్తున్నారన్నారు. గిరిజనులు లేదా సంప్రదాయ అటవీ నివాసితులు తమ వ్యక్తిగత అటవీ భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ధరఖాస్తుతోపాటు సాక్ష్యాలు కోసం ప్రభుత్వ రికార్డులు, జనాభా లెక్కలు సర్వే రికార్డులు మ్యాపుల, ఉపగ్రహ చిత్రాలు,అటవీ విచారణ నివేదికలు,అటవీ శాఖ రికార్డులు, పట్టాలు, ప్రభుత్వ కమిటీల నివేదికలు, ఓటరు గుర్తింపు కార్డులు,రేషన్ కార్డులు,ఇంటి పన్ను చెల్లింపు రశీదులు, నివాస దృవపత్రాలు వంశవృక్ష వివరాలు, గ్రామ నివాసిగా ఆధారాలు, వంటివి జత చేసి ఉంటారని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, విచారించి, సర్వేలు పక్కాగా నిర్వహించి అర్హత కలిగిన వారికి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. ఇప్పటివరకు గంగవరం మినహా మిగతా 6 మండలాల పరిధిలో వ్యక్తిగత పట్టాలకోసం (మొక్కలు పెంపకంలో వున్న భూములు) రెండవ ధపాలో 2005 డిశంబరు 13 నాటికి సాగులోవున్న భూములకు అటవీ హక్కులు కల్పించాలని కోరుతూ 8,351 మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో ఇప్పటివరకు 1507 క్లెయిములను పున:విచారణకు పంపి సాగుచేసుకున్నట్లు ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించి సబ్ డివిజనల్ స్థాయి కమిటీ నిర్ణయం చేస్తూ జిల్లా స్థాయి కమిటికి అప్పీళ్లను పంపించడం జరిగిందన్నారు. జిల్లాస్థాయి కమిటి పరిశీలన అనంతరం అర్హులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం పట్టాలు జారీ చేయడబడతాయన్నారు. మిగిలిన క్లెయిమ్లపై విచారణ కొనసాగుతోందన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ పరంగా 7 మండలాల పరిధిలో 323 క్లెయిములు సుమారు 56,312 ఎకరాలు భూమికి పట్టాలు కోరుతూ గిరిజనవర్గాలు సమర్పించారని వీటిపై ఇంకా ప్రోసెసింగ్ విచారణలు సర్వే చేపట్టాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ అటవీ సంరక్షణ అధికారి తిరుమల రెడ్డి, అటవీ రేంజ్, బీట్ అధికార్లు,తాహశీల్దార్లు, గ్రామ రెవిన్యూ అధికార్లు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us