PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: ప్రధాని మోదీ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని సరేంద్ర మోదీ అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోదీ.. 'స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు భారత్ ను గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకున్న పలు చర్యలను వివరించారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు. 'మీ వ్యాపారాలను, ఆలోచనలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు'ని తెలిపారు. 2011 నాటికి కేవలం పందల సంఖ్యలోనే ఉన్న స్టార్టర్లు ప్రస్తుతం 60వేలకు దాటిందన్నారు. గత ఆరు నెలల్లోనే 10 వేల స్టార్టర్లు ప్రపంచస్థాయి నైపుణ్యాలతో నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో 510లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ డెవలపర్లు పనిచేస్తున్నారని తెలిపారు. “కరోనా వల్ల ఆర్థిక, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా పరిణామాలపై జీ 2!! సదస్సులో చర్చలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. ప్రపంచం మేలు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. కొవిడ్ వేళ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం. ఏడాదిలో 180 కోట్ల టీకా డోసులు పంపణీ చేశాం. భారత్ లో ప్రస్తుతం కొవిడ్ మూడో దశ కొనసాగుతోంది. కరోనా సమయంలోనూ సంస్కరణలు అమలు చేశాం. ప్రపంచానికి కూడా భారత్ ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తోంది. ప్రజాస్వామ్యంపై భారతీయులకు గట్టినమ్మకం ఉంది" అని మోదీ అన్నారు. "ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్ లో ఉంది. కేవలం గత నెలలో యూపీఐ ద్వారా 410 కోట్ల లావాదేవీలు జరిగాయి. మూడో అతి పెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. 'వన్ ఎర్త్ -వన్ హెల్త్ నినాదంతో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు నిలిచాయి. ప్రపంచ దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్ల సరఫరా జరిగింది. భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకొంటోంది. భారతీయులకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది. 21వ శతాబ్దికి సాధికారత కల్పించే సాంకేతికత భారత్ వద్ద ఉంది" అని ప్రధాని వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us