UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మున్సిపాలిటీలో డిఈ, ఇన్ఛార్జ్ కమీషనరుగా పనిచేసి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ కు బదిలీపై వెళ్లిన సోమేశ్వరరావు గురువారం మృతి చెందడంతో స్థానిక మున్సిపల్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ సి.హెచ్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి సోమేశ్వరావుతో పరిచయం ఉందని, ఆయన వృత్తిపరంగా ఎంతో బాధ్యతతో వ్యవహరించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ ప్రభాకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.







