UPDATED 19th FEBRUARY 2018 MONDAY 9:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 18,19 తేదీల్లో జరిగిన జె.ఎన్.టి.యు.కె జోన్-బి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ముగిసాయి. కాకినాడ జె.ఎన్.టి.యు పరిధిలోని సుమారు 36 కళాశాలల నుంచి ఏడు వందల మంది క్రీడాకారులు వాలీ బాల్, ఖో-ఖో, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డీ, బాస్కెట్ బాల్, తదితర క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ జె.ఎన్.టి.యు.కె జోన్-బి పురుషుల విభాగం క్రీడలను రెండు రోజుల పాటు తమ కళాశాలలో నిర్వహించినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచి, విజేతలను, క్రీడా స్పూర్తితో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ జె.ఎన్.టి.యు.కె జోన్-బి పురుషుల క్రీడా నిర్వహణకు తమ కళాశాలను వేదికగా ఎంపిక చేసిన యూనివర్సిటీ, ఉప కులపతికి ధన్యవాదాలు తెలియచేశారు. స్పోర్ట్స్ ఇంఛార్జ్ కె. రఘురాం మాట్లాడుతూ ఈ క్రీడా కార్యక్రమాలకు హాజరైన అతిథులకు, ఇతర కళాశాలల నుంచి విచ్చేసిన అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







