ఆక్వా పరిశ్రమలపై కలెక్టర్ కన్నెర్ర

UPDATED 6TH MAY 2017 SATURDAY 2:30 PM

కాకినాడ: జిల్లాలో ఆక్వా రంగంలో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ చేసే యూనిట్లు వచ్చే నెలరోజుల్లో భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కరప మండలం గురజానపల్లి లో వీరభద్ర ఎక్సపోర్ట్స్ లో అమ్మోనియా లీకేజ్ కారణంగా కార్మికులు అస్వస్థకు గురైన సంఘటనపై ఆయన పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణామండలి, మత్స శాఖ అధికారులతో శనివారం సమావేశమైయ్యారు. అమ్మోనియా లీకేజ్ కి  భాద్యులైన వీరభద్రా ఎక్సపోర్ట్స్ కంపెని పై చర్యలు తీసుకోవాలని ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో ఆక్వా రంగంలో పనిచేస్తున్న అన్ని ప్రాసెసింగ్ యూనిట్లలో నెల రోజులు గడువు లోగా కార్మికులు, సిబ్బంది భద్రత, యూనిట్ల భద్రతా నియమాల ప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని జూన్ ఆరవ తేదీ తర్వాత ఏ యూనిట్లో అభద్రతాభావం కనపడకూడని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఫ్యాక్టరీస్, బాయిలర్లు, ,ఎలక్ట్రికల్ ఇన్సపెక్టరేట్ కాలుష్య నియంత్రణామండలి పరిశ్రమల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. అలాగే వీరభద్ర ఎక్సపోర్ట్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ను తాత్కాలికం గా మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 రాధాకృష్ణమూర్తి, ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్  ఇంజనీర్ రవీంద్ర బాబు, మత్స శాఖ డిడి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us