Updated 26th June 2023 Monday 11:05 am
Moderate Rains : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో జూన్ 29వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.







